కేసీఆర్ జీవితంపై సినిమా.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ జీవితంపై సినిమా..

September 6, 2017

తొలి చిత్రం ‘ బందూక్ ’ తో లైమ్ లైట్ లోకొచ్చిన దర్శకుడు లక్ష్మణ్. ఈ సినిమాతో తన ఇంటి పేరును కూడా బందూక్ గా మార్చుకొని ‘ బందూక్ లక్ష్మణ్ ’ అయ్యాడు. తన తదుపరి సినిమాగా ‘ గులాల్ ’ ను రూపొందించే పనిలో బిజీగా వున్నాడిప్పుడు. ఈ మూవీ కాన్సెప్ట్, మోషన్ పోస్టర్ ను ఇటీవల ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ముఖ్య అతిథి వి. రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా  ‘ గులాల్‘ తెరకెక్కుతోంది. ఇది  కెసీఆర్ జీవితంలోని నాలుగు కోణాలను చూపిస్తుందని అంటున్నాడు దర్శకుడు.

తొలి దఫాలో కారణ జన్ముడి జననం – బాల్యం ( 1954 – 1969 ),  రెండవ దఫా కాలేజీ విద్య, యువ రాజకీయం ( 1970 – 1977 ),  మూడో దఫా రాజకీయ జీవిత తొలిఘట్టం ( 1977 – 2000 ),

నాలుగో దఫా ఉద్యమ జైత్ర యాత్ర ( 2001 – 2014 )  ఇలా నాలుగు దఫాలుగా కెసీఆర్ సమగ్ర జీవితాన్ని చూపుతారు.

తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక కేసీఆర్ నాయకత్వం కింద తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా వడివడిగా పడ్డ దాఖలాలు కూడా మనకు ఈ సినిమాలో సాదృశ్యమవనున్నాయని అన్నారు. అయితే ఈ సినిమా ఒక చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్నది కాబట్టి అందుకు సంబంధించిన గ్రౌండు వర్క్ చాలా పకడ్బందీగా జరుగుతోందని దర్శకుడు చెప్పాడు.  అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ లోని ప్రముఖ నటులు నటిస్తున్నారట. ఎవరనేది ఒక క్రమంలో చెబుతారట.

అక్టోబర్ ద్వితీయార్ధం నుంచి సినిమా  రెగ్యలర్ షూటింగ్ మొదలు పెడతారట. కెసీఆర్ పాత్ర ఎవరు చేస్తారనే ఉత్సుకత ఇప్పటికే చాలా మందిలో కలుగుతోంది. అవన్నీ తెలియాలంటే కొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందేనంటున్నారు. అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బందూక్ లక్ష్మణ్, నిర్మాత : లక్ష్మణ్ కొణతం, సంగీతం : కార్తీక్ కొడకండ్ల,  పాటలు : నందినీ సిధారెడ్డి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, కందికొండ, మాటలు :  అజయ్,రచనా సహకారం : హుస్సేన్ షా కిరణ్,వేణు గోపాల స్వామి,కెమెరా : రాహుల్ మాచినేని ఎడిటింగ్ : మధురెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : రమేష్ మధాసు