యాంకర్ రష్మీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. కాల్ రికార్డే సాక్ష్యం - MicTv.in - Telugu News
mictv telugu

యాంకర్ రష్మీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. కాల్ రికార్డే సాక్ష్యం

March 15, 2022

బుల్లితెరపై వివిధ రకాల షోలతో పాపులరైన యాంకర్ రష్మీ గౌతమ్‌పై సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ సినిమా విషయంలో రష్మీ తనను బాగా ఇబ్బంది పెట్టిందంటూ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ రాణి గారి బంగ్లా అనే సినిమాలో ఓ పాట డబ్బింగ్ చెప్పే సమయానికి రష్మీ నేను చేయనని మొండికేసింది. హీరోను మార్చాలని నాపై తీవ్ర ఒత్తిడి చేసింది.

ఎంతో ఓపికగా తనను ఒప్పించాలని ప్రయత్నించినా.. నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్‌ప్రసాద్ రెడ్డి తెలుసంటూ దురుసుగా ప్రవర్తించింది. దాంతో నేను కూడా నాకు వారిద్దరితో పాటు చాలా మంది తెలుసని చెప్పా. సినిమా మధ్యలో వదిలేస్తే న్యాయపరమైన చర్యలకు దిగుతానని, ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేస్తానని బెదిరించా. దాంతో దిగొచ్చి షూటింగ్ పూర్తి చేసింద’ని తెలిపాడు. అప్పుడు రష్మీతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పటికీ తన వద్ద ఉందని నాగలింగం చెప్పాడు. అయితే.. రష్మీ మంచి నటి అని, ఎప్పుడు కూడా రెండో టేక్ తీసుకోలేదని ప్రశంసించాడు.