వెనకున్న కొండను చూసి విర్రవీగా.. దిక్కులేకుండా ఐపోయా : కమెడియన్ పృథ్వీరాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

వెనకున్న కొండను చూసి విర్రవీగా.. దిక్కులేకుండా ఐపోయా : కమెడియన్ పృథ్వీరాజ్

March 26, 2022

01

తన కామెడీ టైమింగ్‌తో స్వల్పకాలంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగిన పృథ్వీరాజ్ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి సమయంలో రాజకీయ రంగంలో ప్రవేశించి వైసీపీ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఫలితాల తర్వాత ఎస్వీబీసీ భక్తి ఛానెల్ చైర్మెన్‌గా పదవి చేపట్టి తొందర్లోనే దాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు చేసిన రాజకీయ రంగంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల సినిమా రంగంలోనూ అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు శారీరకంగా, ఆర్థికంగా చాలా నష్టపోయి కష్టాల్లో ఉన్నారు. తాజాగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

‘ చాలా రోజులుగా ఆందోళనల వల్ల నిద్రలేని రాత్రులను గడిపాను. కోవిడ్ సోకి శారీరకంగా బలహీనపడ్డా. సినిమాల పరంగా ఇంతకు ముందులా సినీ పెద్దలు, నిర్మాణ సంస్థలు నన్ను ఎంకరేజ్ చేయడం లేదు. రాజకీయ రంగంలో చేసిన కొన్ని తప్పుల వల్ల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాలాంటి వాడికి రాజకీయాలు పడవు. ఎస్వీబీసీ పదవిలో ఉన్నప్పుడు నేను సంతోషించా. కానీ, నా వెనకాల చాలా మంది ఏడ్చారు. ఇప్పుడు చూస్తే అందరూ బాగానే ఉన్నారు. నేనే రోడ్డున పడ్డాను. నా వెనకాల ఉన్న కొండను చూసి మురిసిపోయి విర్రవీగా. దాంతో సినీ పెద్దలు అంతా ఒక్కటయ్యారు. నేను ఒంటరిగా మిగిలా. నా కామెడీ నాకే తగిలినట్టయింది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు నాకు సైరా సినిమాలో అవకాశం ఇచ్చారు. అది ఆయన గొప్పతనం. ఈ సందర్భంగా నేను పవన్ కల్యాణ్ గారిని ఫాలో అవుతాను. ఆయన చెప్పిన అహంకారానికీ, ఆత్మ గౌరవానికీ మధ్య జరిగే పోరాటాన్ని అనుసరిస్తాను. నిర్మాత అశ్వనీదత్ గారిని క్షమించమని కోరుతున్నా. రాఘవేంద్ర రావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి పెద్దలను కలుస్తా. నేను మారాను. మారి మీ వద్దకు వస్తున్నాను. నాకు మద్ధతుగా నిలబడమని వేడుకుంటున్నా’నని వినమ్రంగా అర్థించారు.