సూర్య ‘గ్యాంగ్’ సినిమా తరహాలో సికింద్రాబాద్లో భారీ చోరి
సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా గ్యాంగ్. ఇందులో హీరో ఐటీ ఆఫీర్లంటూ ఫేక్ ఐడీ ప్రూఫ్స్ చూపించి దొంగతనం చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగింది. శనివారం (మే 27) ఉదయం ఐటీ ఉద్యోగులమంటూ ఫేక్ ఐడీ కార్డ్స్ చూపించిన.. 2 కిలోల బంగారంతో ఉడాయించారు. చివరికి విషయం తెలిసిన షాప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో 4 నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన రివెన్ మధుకర్ బవర్.. బాలాజీ జ్యూవెలరీ పేరుతో షాప్ ఓపెన్ చేశాడు. కొద్దిరోజుల క్రితం రివెన్ సొంతేరికి వెళ్లగా.. తన బావమరిది వికాస్ గోల్డ్ షాప్ను చూసుకుంటున్నాడు. అయితే, శనివారం ఉదయం ఐదుగురు దొంగలు దుకాణానికి వచ్చి.. ఐటీ ఉద్యోగులమని, షాప్లో అవకతవకలు జరుగుతున్నాయి సోదాలు చేయాలని బెదిరించారు. ఓనర్ సహా, సిబ్భంది సెల్ ఫోన్లు లాక్కొని పక్కన కూర్చోబెట్టారు. వాళ్లలో ఇద్దరు ఎంక్వైరీ పేరుతో వివరాలు సేకరించగా.. మిగతా ముగ్గురు బంగారాన్ని తనికీ చేయాలని బ్యాగుల్లో సర్దారు.
ఈ బంగారానికి ఎలాంటి టాక్స్ కట్టలేదని.. అందుకే స్వాధీనం చేసుకుంటున్నామని నమ్మించారు. తర్వాత యజమానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమంతా పక్క దుకాణదారులకు చెప్పగా వాళ్లు.. ఐటీ అధికారులు తనికీ చేయరని, నోటీసులు ఇస్తారని చెప్పారు. దాంతో మోసపోయానని గ్రహించిన యజమాని.. మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీని పరిశీలించిన పోలీసులు.. దుండగులు దోపిడి తర్వాత సికింద్రాబాద్ మీదుగా ఉప్పల్ వైపు వెళ్లారని గుర్తించారు.
ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఐదు బృందాలుగా ఏర్పడి దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో గాలింపు కొనసాగుతుందని ఏసీపీ రమేష్ తెలియజేశారు. కొత్తవారు ఎవరైనా షాపుల్లోకి అధికారులమంటూ వస్తే జాగ్రత్త వహించాలని దుకాణదారులకు సూచించారు.