రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి ప్రముఖుల నుంచి రోజురోజుకూ ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సమీర్ శుక్రవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంపీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రకృతికి మేలు చేయడమేకాక ప్రజల ఆరోగ్యానికి కూడా రక్షణగా నిలుస్తుందని కొనియాడారు. తన లాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ కింద మొక్కలు నాటాలని ఆయన నటుటు శ్రీకాంత్, సన, జీవిత, రాజశేఖర్లకు చాలెంజ్ విసిరారు.