ఈ వారం థియేటర్, ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్, ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలు

November 21, 2022

కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తున్నాయి. సినీ అభిమానులు కూడా స్టార్ ఉంటేనే చూస్తామనే ధోరణి నుంచి బయటికి వచ్చేశారు. దీంతో చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. ఈ వారం కూడా చాలా చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

1. మొదటగా ఈ వారం చెప్పుకోవాల్సింది అల్లరి నరేష్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఆనంది జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లో రిలీజవుతుంది.
2. తోడేలు పేరుతో వస్తున్న భేడియా అనే బాలీవుడ్ చిత్రం అక్కడ మంచి వసూళ్లను సాధించింది. వరుణ్ ధావన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి పరిణాలు చోటు చేసుకున్నాయనే అంశంతో ఆసక్తికరంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రం కూడా నవంబర్ 25న థియేటర్లో విడుదల అవుతోంది.
3. లవ్ టుడే : ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్న ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. యువ ఆడియెన్సే టార్గెట్ గా నవంబర్ 25న థియేటర్లో బరిలోకి దిగుతోంది.
4. రణస్థలి : క్రైమ్ కథాంశంతో వస్తున్న మరో చిత్రం రణస్థలి. ఇటీవలే దర్శకుడు క్రిష్ చేతులమీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మాటల రచయిత పరశురాం దర్శకుడు. నవంబర్ 26న థియేటర్ కి రానుంది.

ఇక ఓటీటీలు చూస్తే.. తెలుగు భాషలో వెన్స్ డే అనే వెబ్ సిరీస్ నవంబర్ 23న నెట్ ఫ్లిక్స్ లో, ప్రిన్స్ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో నవంబర్ 25న, సోనీ లివ్ లో హీరో నాని సోదరి తెరకెక్కించిన మీట్ క్యూట్ సినిమా నవంబర్ 25న రిలీవుతున్నాయి. ఆహాలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నవంబర్ 25న విడుదలవుతోంది. ఇక బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 4 కూడా అదే రోజు ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తుంది.