Moving pregnant woman to hospital with JCB: Here is the video
mictv telugu

జేసీబీతో గర్భిణిని ఆస్పత్రికి తరలింపు: వీడియో ఇదిగో

August 25, 2022

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు, పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో గ్రామాల్లో కరెంట్ నిలిచిపోయింది. దాంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో పట్టణాలకు వెళ్లేందుకు, ఆసుపత్రులకు వెళ్లేందుకు అందుబాటులో బస్సులు, వాహనాలు లేక అందుబాటులో ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని వాగులను, వంకలను దాటుతున్నారు.

ఈ క్రమంలో నీమాచ్‌ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. కానీ, వరదల ఉధృతి కారణంగా అంబులెన్స్‌ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు. దాంతో అక్కడున్న స్థానికులు, అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు ఆ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఓ జేసీబీని ఏర్పాటు చేసి, ఆసుపత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

 

మరోపక్క మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ప్రమాద హెచ్చరికల్లో ఆ గర్భిణి నివాసిత జిల్లా కూడా ఉంది. ఓవైపు గర్బీణి ప్రసవ వేదన, మరోవైపు రెడ్ అలెర్ట్ విధింపు ఇటువంటి సమయంలో అధికారులు, స్ధానికులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తుంది.