Home > Featured > పులిని చూసి దీనికి వాతలు పెట్టారు (వీడియో)

పులిని చూసి దీనికి వాతలు పెట్టారు (వీడియో)

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు’ అని నానుడి వుంది. ఆ నానుడి నక్క విషయంలో కాకుండా ఓ కుక్క విషయంలో నిజమైంది. అచ్చం పులి మాదిరి అది చారల కుక్క అయింది. కాకపోతే ఈ కుక్క వాతలు పెట్టుకుని పులి అవలేదు. దానిని దూరం నుంచి ఎవరు చూసినా బుజ్జి పులి అనుకుంటారు. అది అరిస్తే గానీ అది కుక్క అని ఎవరూ అనుకోరు. దీనిని చూడటానికి చాలామంది వస్తున్నారట. అమెరికాలోని ఓర్లాండోలో వుంటుంది ఈ పులికుక్క. సైబీరియన్ పులిలా వున్న దీనిపేరు లోకి.

అది పుట్టడమే అలా పుట్టిందా? ఏదైనా జన్యులోపమా? అంటూ చాలామంది రకరకాల ప్రశ్నలు దాని యజమానిని అడిగారు. అప్పుడామె చెప్పిన మాట విని వారంతా మరింత షాక్ అయ్యారు. సదరు కుక్క యజమాని బాడీ పెయింటర్ అవడంతో.. లోకీని వెరైటీగా సింగారించాలని ఈ పని చేసింది. అది కూడా బుద్ధిగా చారలు వేయించుకుని పులిలా మారానని పోజులు కొడుతోంది.

Updated : 16 Sep 2019 12:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top