అమ్మ సెంటిమెంట్… అవినాశ్ రెడ్డికి 31 వరకు ఊరట..
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎట్టకేలకు మరోసారి ఊరట లభించింది. అవినాశ్ తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆయనను ఈ నెల 31 (బుధవారం) వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. బుధవారం ఆయన ముందస్తు బెయిల్‌పై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.
శనివారం వరసగా మూడోరోజు కోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. అవినాశ్ విచారణకు సహకరించడం లేదని, హత్య వెనక రాజకీయాలు ఉన్నాయని సీబీఐ న్యాయవాది అనిల్ ఆరోపించారు. ఏ ఆధారాలతో ఆయనను అభియోగాలు మోపుతున్నారని కోర్టు అడగ్గా సాక్షుల వాంగ్మూల ఆధారంతో కేసు పెట్టామని తెలిపారు. సాక్ష్యాలకు క్లుప్తంగా వివరించిన ఆయన ఇప్పుడ పూర్తి వివరంగా చెప్పాలేమని అన్నారు. వాటిని సీల్డ్ కవర్లో కోర్టుతోపాటు అవినాశ్ రెడ్డికి కూడా ఇస్తామన్నారు. తాము ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ఆలోపు అవినాశ్‌పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని కోర్టు సూచిందింది. అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని ఆయను బుధవారం అరెస్ట్ చేయొద్దని అనిల్ కోరగా కోర్టు మన్నించింది.