ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ బండి సంజయ్ అరెస్ట్

October 26, 2020

MP Bandi Sanjay arrested

దుబ్బాక ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. పోలీసులు అభ్యర్థుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల శామీర్‌పేట్‌లో పట్టుబడ్డ రూ.40 లక్షలు బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందినవిగా తేలిన విషయం తెల్సిందే. తాజాగా పోలీసులు సిద్దిపేటలోని రఘునందన్ రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ విషయం తెలియడంతో ఆయన హుటాహుటిన సిద్దిపేటకు చేరుకున్నారు. త‌నిఖీల్లో భాగంగా ఆ ఇంట్లో ఉన్న‌ రూ.18.67 ల‌క్ష‌ల‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు వెళ్తుండగా ఆయనను అరెస్ట్ చేశారు. 

సిద్దిపేటలో రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేటలో సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని సిద్దిపేట నుంచి కరీంనగర్‌కి తీసుకెళ్తున్నారు. కాగా, దుబ్బాక ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 10వ తేదీన ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.