MP: Child busy playing 'Free Fire' dies of snakebite
mictv telugu

ఆన్‌లైన్ ఆటలో పడి పాము కాటేస్తున్నా పట్టించుకోలేదు.. చివరకు..

September 5, 2022

ఫోన్ లో గేమ్‌కు బానిసైన ఓ బాలుడు పాము కాటు వేస్తున్నా పట్టించుకోలేదు. ఏ మాత్రం చలనం లేకుండా ఆటలోనే నిమగ్నమై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్లో జరిగింది. మృతి చెందిన బాలుడు రింకూగా గుర్తించారు పోలీసులు. వివరాల్లో వెళితే.. ఇండోర్ చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఇటుక బట్టీలో పని చేస్తోంది. వారి స్వస్థలం ఉత్తర్ప్రదేశ్లోని లలిత్పుర్. కాగా, గత రెండేళ్లుగా ఇతడు ఇక్కడ పని చేస్తున్నారు. వారు పనుల నిమత్తం వారిదగ్గర వున్న ఫోన్ ను బాలుడి చేతికిచ్చి తల్లదండ్రులు పని చేసుకునేవారు. అలా ఆ బాలుడు ఫోన్లో ఆన్లైన్ గేమ్లకు బానిసయ్యాడు.

వారు పనిచేస్తున్న సమయంలో.. ఒళ్లు తెలియకుండా ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. ఆక్షణంలో పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. ఆబాలుడు అదికూడా గమనించకుండా.. బాలుడు గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అయితే కొద్ది క్షణాల్లోనే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గుర్తించిన ఆ ఇటుక బట్టీ యజమాని ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. బాలుడికి చికిత్స చేస్తుండంగానే మృతి చెందాడు. చందన్నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.