వెంకన్న స్వామి వేషధారణలో ఎంపీ.. ఫోటోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న స్వామి వేషధారణలో ఎంపీ.. ఫోటోలు వైరల్

May 16, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి వారి వేషం ధరించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. వీధుల్లో తిరుగుతూ, భక్తులను దీవించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురుమూర్తి వేషధారణకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

2017వ సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్‌కు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా ఉన్న గురుమూర్తి.. 2021లో తిరుపతి లోకసభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి 2,30,572 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.