ఎంపీ జయా బచ్చన్ ముక్కుసూటితనంగా వ్యవహారిస్తుంటారు. ఆమె పార్లమెంట్ లో ఆగ్రహంగా మాట్లాడటం చాలా సార్లు చూసే ఉంటారు. ఈరోజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటు-నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై అభినందనలు తెలుపుతూ మరోసారి రెచ్చిపోయింది. నిజానికి, జయా బచ్చన్ ఇండియన్ సినిమాని పొగుడుతూ ఉండగా మధ్యలో ఎంపీ నీరజ్ అడ్డుకున్నారు. దీంతో జయ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రసంగం సమయంలో అంతరాయం కలిగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జయ.. నీరజ్, ఎప్పుడూ ఇలాగే చేస్తారా మండిపడ్డారు. ఈరోజుల్లో మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుకోవడం ఓ రోగంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా మర్యాదపూర్వకంగా మాట్లాడితే దురుసుగా ప్రవర్తించరాదని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఆస్కార్‌ను భారత్ మాత్రమే గెలుచుకుందని, ఉత్తరాది-దక్షిణాది కాదన్నారు.
ఎంపీపై జయ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మాకూ నోరుందన్నారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మేడమ్ మీది గొంతు కాదు.. చాలా పెద్ద గొంతుక, మాకు తెలుసు అని శాంతించాలని చెప్పారు. ఈరోజు రాజ్యసభలో నాటు-నాటు పాటకు ఆస్కార్ అవార్డును గెలుచుకున్న టీమ్‌ను పలువురు నేతలు అభినందించారు. ఇది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ప్రశంసలు తెచ్చిపెట్టిందని ఎంపీలు అన్నారు. అదే సమయంలో, జయా బచ్చన్ కూడా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఇది ఒక పెద్ద విజయంగా పేర్కొన్నారు. ఇప్పుడు సినిమాలకు ఇండియా అతిపెద్ద మార్కెట్ అని, అమెరికా వెనుకబడిపోయిందని అన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళిని జయబచ్చన్ అభినందించారు. రాజమౌళి దర్శకత్వం అద్భుతంగా ఉందని అన్నారు. ఈ విజయం ఉత్తరాది-దక్షిణాదిది కాదని, యావత్ భారతదేశానిదని పేర్కొన్నారు జయబచ్చన్.