జానారెడ్డికి ఎంపి కవిత సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

జానారెడ్డికి ఎంపి కవిత సవాల్

August 3, 2017

జానారెడ్డి ఆరోపించినట్లు సతీష్ ఎప్పుడూ జాగృతి సభ్యుడు కాదు.

సతీష్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్ ముదిరాజ్ కి అత్యంత సన్నిహితుడు.

మీరు పేర్కొన్న వ్యక్తి పేరు, అడ్రస్ ను ఇస్తున్న మీ ఆరోపణలు నిరూపించండి.

టీఆర్ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షమే.

సింగరేణి కారుణ్య నియామకాలను అడ్డుకుంటుంది కాంగ్రెస్సే.

నిజామాబాద్ నియోజక వర్గానికి పవర్ మినిస్టరీ నుంచి రావాల్సిన 314 కోట్లు రావాల్సి ఉంది ఈ అంశంపై పవర్ మినిస్టర్ పియూష్ గోయల్ తో చర్చించా.

జగిత్యాల కు ఏకలవ్య పాఠశాల ను కేటాయించాలని ట్రైబల్ మినిస్టర్ జువైల్ ఓరాం ని కలిసా.

నిజామాబాద్ నియోజక వర్గంలో 100 ఎకరాలలో నిర్మించనున్న పార్క్ కు ఆర్థిక సాయం అందించే అంశంపై అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ ని కలిసాం.

మా విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. రేపు గల్ఫ్ బాధితుల సమస్యలపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటి కానున్నాం

గల్ఫ్ బాధితులకు సంబంధించి దాదాపు 35 కేసులు నా దగ్గర ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరనున్నాం..,

అంటూ ఎంపీ కవిత చాలా ఘాటుగా స్పందించారు.