తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన కె. వాసుదేవ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టెక్నకల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన చిరుమల్ల రాకేశ్, టిఆర్ ఎస్ అనుబంధ విద్యార్థి సమితి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆశీస్సులు తీసుకున్నారు. తమ నియామకానికి కృషి చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సతీసమేతంగా సిఎం క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్‌కు వాసుదేవ రెడ్డి వచ్చారు. అక్కడే కవితతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్ రెడ్డిలను కలిసి పుష్పగుచ్చాలను అందేశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నవారికి సిఎం కేసిఆర్ న్యాయం చేస్తున్నారని మీ నియామకాలే ఇందుకు నిదర్శనమన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వాసుదేవ రెడ్డికి సూచించారు. ఉద్యమంలో ఓయు విద్యార్థులుగా రాకేశ్, గెల్లు శ్రీనివాస యాదవ్‌లు ఉద్యమించిన తీరు మనందరికీ తెలిసిందేన్నారు. రాకేశ్, శ్రీనివాస్ యాదవ్‌లు తమ అనుచరులు, ఓయు విద్యార్థులతో తరలిరావడంతో ప్రగతి భవనం సందడిగా మారింది.