కవితక్క కాన్సెప్ట్ కేక..! - MicTv.in - Telugu News
mictv telugu

కవితక్క కాన్సెప్ట్ కేక..!

July 25, 2017

టీఆర్ఎస్ ఎంపీ కవిత.. వెరీ వెరీ స్పెషలిస్టు లీడర్..ఏం చేసినా నలుగురు చెప్పుకోవాల్సిందే. మాటల్లో మ్యాజిక్..చేతల్లో చమక్కులు…టోటల్ గా సంథింగ్ స్పెషల్. అందుకే ఈ లేడీ ఎంపీకి ఉన్న ఫాలోయింగ్ దేశంలో మరేవరికి లేదేమో. ఇప్పుడో కొత్త కాన్సెప్ట్ తో జనం ముందుకు వచ్చారు..అదిరిపోయే లెవల్లో ఉన్న ఆ కాన్సెప్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సిస్టర్స్ 4 ఛేంజ్..క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఎంపీ కవిత.అందరు అక్కచెల్లెళ్లు,అన్నతమ్ముళ్లని ఇందులో భాగస్వాముల్ని చేస్తున్నారు. ఈ సారి రాఖీ పండుగ నుంచి ఈ మంచి పని షురూ చేయబోతున్నారు.ఇంతకీ ఏం చేయాలంటే రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ ను గిఫ్ట్ కూడా ఇవ్వాలని కవిత సూచిస్తున్నారు.

రాఖీ పండుగకు హెల్మెట్ ఎందుకంటే..బలమైన కారణం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 4 వందల మంది చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే వీరి ప్రాణాలు పోతున్నాయి. అందుకే వీటిని నివారించాలంటే హెల్మెట్ మస్ట్ గా పెట్టుకోవాల్సిందే. ఎంపీ కవిత ..బ్రదర్స్ సిస్టర్ ని కోరుతున్నది ఇందుకే.

సో సిస్టర్స్ అండ్ బ్రదర్ రాఖీతో పాటు హెల్మెట్ మరిచిపోవద్దు..అందరం హ్యాపీగా ఉండాలంటే తప్పదు. ఇకనుంచి హెల్మెట్ తో బండెక్కిన అన్నకు ఎప్పుడు చెల్లమ్మా రక్షణగా ఉంటుంది.

టీఆర్ఎస్ ఎంపీ కవిత చేస్తున్న ఈ పనికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..అందరూ మస్ట్ గా ఫాలో కావాల్సిందే..ఏదైనా చేయాలంటే ప్రాణాలు ఉండాలి కదా..అందుకే హెల్మెట్ తప్పనిసరి.