సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

December 21, 2021

07

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్ధుల ఫలితాల పట్ల ఇంటర్ బోర్డు వ్యవహరించిన తీరుపై ఇటు విద్యార్ధులు, అటు విద్యార్ధి సంఘాల నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇంటర్ బోర్డుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ ఫలితాలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు. ‘గుర్తు పెట్టుకో కేసీఆర్.. త్వరలోనే ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్ధులు తగిన బుద్దిచెప్పడం ఖాయమని’ అన్నారు. ఈ ఫలితాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకారమన్నారు. ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్ధులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వస్తుందని, వారి జీవితాలతో చెలగాటమాడిన టీఆర్ఎస్ ప్రభుత్వం సంగతి తెల్చుతారన్నారు.