పోలీసులకు చేతులేత్తి మొక్కిన ఎంపీ మాధవ్ - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులకు చేతులేత్తి మొక్కిన ఎంపీ మాధవ్

May 22, 2020

Mp madhav requesting police about bikes

వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు చేతులెత్తి మొక్కిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా పార్లమెంట్ సభ్యుడు అయుండి పోలీసులకు మొక్కడం ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..లాక్‌డౌన్ విధించిన కొత్తలో‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి స్టేషన్‌లలో పెట్టిన సంగతి తెల్సిందే. వాటికి ఇంకా మోక్షం కలగలేదు. అవి ఎండకు ఎండుతున్నాయి.. వానకు తడుస్తున్నాయి. చివరకు చెడిపోయే స్థితికి చేరుకున్నాయి.

ఈ విషయాన్ని కొందరు వాహనదారులు ఎంపీ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. తమ వాహనాలను ఇప్పించాలని కొందరు ఆయన్ను కోరారు. దీనిపై ఎంపీ మాధవ్ స్పందించారు. సీఐలు బాల మదిలేటి, మన్సూరుద్దీన్‌లతో ఎంపీ స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’మీకు చేతులేత్తి మొక్కుతా.. మోటార్ సైకిళ్లను స్టేషన్‌లో ఎండ పెట్టకుండా వదిలేయండి. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్‌ ఉన్న వాహనాల నుంచి మంటలు వస్తాయని’ అని‌ అన్నారు. గురువారం రోజున స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగింది.