భార్యతో రెండో పెళ్లి.. ఆమె చెల్లికీ కట్టేశాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

భార్యతో రెండో పెళ్లి.. ఆమె చెల్లికీ కట్టేశాడు..!

December 11, 2019

madhya pradesh

ఓ వ్యక్తి తన భార్యను రెండోపెళ్లి చేసుకున్నాడు. అలాగే అదే ముహూర్తానికి ఆమె చెల్లిని కూడా పెళ్లి చేసుకున్న సంఘటన నవంబర్‌ 26న మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. భింద్‌ జిల్లాలోని గుడావళి గ్రామానికి చెందిన దీపు పరిహార్‌(35) అనే వ్యక్తికి వినిత(28)తో తొమ్మిదేళ్ల పెళ్లైంది. వీరికి ముగ్గురు సంతానం.

గత కొంతకాలంగా వినితా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో వారి ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు దీపుకు రెండో పెళ్లి చేయాలని వినితా నిర్ణయించుకుంది. ఒకే ముహుర్తానికి మరోసారి వినితా తోపాటు ఆమె చెల్లెలు రచన(22)ను పెళ్లి చేసుకునెలా ఏర్పాటు చేసింది. ఇక హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరం. అయినా ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని భింద్‌ ఎస్పీ రుడాల్ఫ్‌ అల్వారిస్‌ తెలిపారు. వినిత గుడావళి సర్పంచ్‌ కావడం మరో విశేషం. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.