దారుణం.. పోయిన కొడుకు కోసం బాధపడుతున్న తల్లిని.. - MicTv.in - Telugu News
mictv telugu

దారుణం.. పోయిన కొడుకు కోసం బాధపడుతున్న తల్లిని..

July 30, 2020

MP: Man slits mother’s incident as ‘she loved elder son more’

రానురాను వెరైటీ వెరైటీ సైకోగాళ్లు తయారవుతున్నారు. కన్న ప్రేమను కూడా అపార్థం చేసుకున్న ఓ సైకోగాడు కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు. కన్నబిడ్డల మీద ఏ తల్లి ప్రేమ అయినా సమానంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో ఒక బిడ్డను కాస్త ఎక్కువ ప్రేమిస్తారు. అలాగని వారు తమను ప్రేమించడంలేదు.. ధ్వేషిస్తున్నారని పొరబడితే ఎలా? ఈ దుర్మార్గుడు అలాంటివాడే. తనకన్నా ముందు పుట్టిన అన్నయ్యనే అమ్మ ఎక్కువగా ప్రేమిస్తోందని భ్రమపడి ఆమెను గొంతుకోసి చంపాడు. లోకంలో ఇంతకన్నా దారుణమైన కొడుకు ఎవడైనా ఉంటాడా? మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. తల్లిని చంపిన సదరు నిందితుడు కొంత కాలంగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు. 

ఏడాది క్రితం అతని అన్న చనిపోయాడు. అప్పటినుంచి ఆ తల్లి కన్నబిడ్డను తలుచుకుని కన్నీరు  మున్నీరు అవుతోంది. చెట్టంత ఎదిగిన కొడుకును పోగొట్టుకున్నానని ఆమె బాధ పడసాగింది. ఇది చూసి చిన్న కొడుకు కన్ను కొట్టింది. అన్నయ్య పోయినా వాడిమీద తల్లి ప్రేమ ఇంకా ఎక్కువ అయిందని అపోహపడ్డాడు. రేపు తాను పోయినా ఆ తల్లి అంతే ఏడుస్తుందని అతని సైకో బుర్రకు తట్టలేదు. ఈ క్రమంలోనే ఇటీవల అతడు ఆమెను గొంతు కోసి చంపేశాడు. అంతేకాకుండా ఈ ఘాతుకాన్ని కెమెరాతో చిత్రీకరించాడు. అయితే ఇవేవీ తెలియని అతని తండ్రి, తన భార్యను ఎవరో చంపి అడవిలో పడేశారంటూ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత చిన్న కొడుకు ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ తండ్రి, మళ్లీ పోలీసులను ఆశ్రయించి చిన్నకొడుకుపైనే అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.