Home > Featured > కరెంటు విజయాలపై కరెంటు మంత్రి ప్రెస్‌మీట్.. చీకట్లో..

కరెంటు విజయాలపై కరెంటు మంత్రి ప్రెస్‌మీట్.. చీకట్లో..

ఓ విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దీంతో ఆయన ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. కాసేపటివరకు అక్కడ మీడియా ప్రతినిధులకు నవ్వాలో ఏం చేయాలో తోచక గమ్మున వుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ ప్రసంగిస్తున్న మంత్రి విద్యుత్ శాఖ మంత్రి అవడం విశేషం. ఆయన ఎవరంటే మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రియవ్రత్ సింగ్‌. మంగళవారం మధ్యప్రదేశ్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇంతలో కరెంటు పోయింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నది కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాల గురించి.

దీంతో ఆయన తన ప్రసంగాన్ని ఆపకుండా చీకట్లోనే కొనసాగించారు. ఎందుకిలా జరిగిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పోయిన కరెంట్ ఒక నిమిషంలో మళ్లీ రావడం వెనుక ఏదో కుట్ర ఉండి ఉండొచ్చు. ఇది నిజంగా కరెంటు కోత అయితే ఒక నిమిషంలో ఎక్కడైనా వస్తుందా?’ అని తాపీగా సమాధానం ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చేసరికి విద్యుత్ రంగ సంస్థలు తీవ్ర నష్టాలతో ఉన్నాయని, దానికి గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ చర్యలే కారణం అని అన్నారు.

Updated : 20 Aug 2019 10:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top