Mp Raghu Rama Krishna Raju Comments On TTD and YCP Govt.
mictv telugu

టీటీడీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తారా.?.. ఆర్ఆర్ఆర్

January 11, 2023

Mp Raghu Rama Krishna Raju Comments On TTD and YCP Govt.

తిరుమల విషయంలో ఏపీ ప్రభుత్వ నేతృత్వంలోని టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు ఎంపీ రఘు రామకృష్ణం రాజు. తిరుమలలో భక్తులు విడిది చేసే గదుల బాడుగను అడ్డగోలుగా పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంకన్నను భక్తులను దూరం చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోందా.. అందుకే ఈ అసంబద్ధమైన నిర్ణయాలను తీసుకున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తారేమో అన్నారు. వెంకటేశ్వర స్వామి వారిని ఆదాయ వనరుగా భావిస్తున్నారేమో అన్నారు.

రూ.100 నుంచి రూ.1700కు

రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు, తరువాత నియంత్రణ అని అడ్డగోలుగా మద్యం ధరలను పెంచారన్నారు. మద్యం ధరలను పెంచితే, మందుబాబులు వాటి జోలికి వెళ్లారని భావించి మద్యం ధరలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే అన్నారు. ఇప్పుడు అదే విధానాన్ని వెంకన్న భక్తుల విషయంలో అమలు చేస్తున్నారా అన్నారు. తిరుమలలోని నారాయణ గిరి గెస్ట్ హౌస్ లో అద్దె గది బాడుగ ధర రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.1700 గా నిర్ణయించారన్నారు..

పేద భక్తులు దర్శనానికి పనికిరారా..?

గతంలో సినిమా టికెట్‌ను రూ.100 ఉన్నదాన్ని పది రూపాయలకు ముఖ్యమంత్రి జగన్ తగ్గించిన విషయం తెలిసిందేనని.. సినిమా టికెట్ ధరలను ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే.. పేదవాడు సినిమా చూడకూడదా అన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. మరి ఇప్పుడు పేద భక్తుడు భగవంతుని దర్శనానికి పనికిరాడా అన్నారు. పెత్తందారులకు, పేదలకు మధ్య పోరాటం అని చెబుతున్న జగన్.. ఇక్కడ పెత్తందారులు అంటే ఎవరని ప్రశ్నించారు. తిరుమల కొండకు చేరిన భక్తులకు ముందుగా టోల్ ట్యాక్స్ రూపంలో బాదుడు ప్రారంభమవుతుందని.. అద్దె గదిలో బాడుగను అడ్డగోలుగా పెంచి భక్తులపై అదనపు భారం మోపారని అన్నారు. పేద భక్తుడైతే అద్దె గది బాడుగ చెల్లించడానికి దైవ దర్శనం మానుకోవలసి ఉంటుందని అన్నారు.
మునుపెన్నడూ చూడలే..

తిరుమలకు రోప్ వే ను నిర్మించాలని అనుకోవడం సరికాదన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారని ఉత్తర ద్వారాన్ని తెరవడం ఆలయ ఆరంభం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఒక్కరోజే ఉత్తర ద్వారం తెరవడం ఎందుకనీ.. పది రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని తెరువాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు.