కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా నది ఒడ్డున కల్వకుర్తి ఎత్తిపోతల పథక మొదటి దశ లిఫ్టు పంపుహౌస్‌లో జరిగిన ప్రమాద ఘటనను పరిశీలించేందుకు వెళ్తుండగా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బలవంతంగా రేవంత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్‌లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
నిన్న శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, నేడు కల్వకుర్తి లిఫ్ట్ మునక… ప్రమాద స్థలికి ప్రతిపక్షం వెళితే ప్రభుత్వానికి ఉలుకెందుకు? ఖాకీ పహార తో నిజాన్నెందుకు దాస్తోంది.
ఆలోచించు తెలంగాణమా! @manickamtagore @UttamTPCC @seethakkaMLA @KVishReddy @sravandasoju @SampathKumarINC pic.twitter.com/IUyfVTKgVE— Revanth Reddy (@revanth_anumula) October 17, 2020
సర్జిపూల్ నుంచి వరదనీరు భారీగా పంప్‌హౌస్‌లోకి చేరింది. 14 అంతస్తుల్లో 10 అంతస్తులు నీటిలో మునిగిపోయాయి. దీంతో మోటారు బిగించిన ఫౌండేషన్ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడడంతో పంప్‌హౌస్ గోడను చీల్చుకొని ఫౌండేషన్ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకువచ్చాయి. అక్కడే ఉన్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే దాన్ని పరిశీలించేందుకు నేతలు అక్కడికి వెళ్లారు. కానీ కొల్లాపూర్ వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై రేంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ప్రాంతం వద్దకు ప్రభుత్వం ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. ఖాకీ పహారాతో నిజాలు దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నేతల అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.