MP Tejasvi Surya cycled for 90 kms
mictv telugu

90కిలోమీటర్ల సైకిల్ తొక్కి ఎంపీ రికార్డ్

November 14, 2022

బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య అరుదైన రికార్డ్ సాధించారు. ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజ్‌ని పూర్తి చేసిన తొలి పార్లమెంటేరియన్‌గా చరిత్రకెక్కారు. ట్రయాథ్లాన్‌లో భాగంగా ఏకంగా 90 కిలోమీటర్లు సైకిల్ తొక్కి అందరినీ ఆశ్యర్య పరిచారు.

తేజస్వీ సూర్య కర్ణాటక సౌత్ సెగ్మింట్ ఎంపీ. న్యూ టీమ్ ఇండియాలో భాగంగా 70.3లో సివిల్ సర్వేంట్ శ్రేయస్ హోసూర్ ,వ్యవస్థాపకుడు అనిత్ జైన్ లతో కలిసి ప్రధానిమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు. ఇందులో హోసూర్ మొదట 1.9కిలోమీటర్ల స్విమ్మింగ్ లెగ్‌ని ఈదగా , 2 వ లెగ్ ఈవెంట్ కోసం తేజస్వీ సూర్య 90కిలోమీటర్ల సైక్లింగ్ చేశారు. అటు అనిత్ జైన్ 21.1కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను పూర్తి చేశారు.

ఈ ఛాలెంజ్‌ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. 33 దేశాల నుంచి 15వందల మంది పాల్గొన్నారు. ఐరన్ మ్యాన్ 70.3.. దీన్ని హాఫ్ మారథాన్ అని కూడా అంటారు. స్విమ్మింగ్ , రన్నింగ్ , సైక్లింగ్ తో కూడిందే ట్రాయాథ్లాన్. .మోదీ ప్రభుత్వం క్రీడలు, ఫిట్ నెస్ పై పలు కార్యక్రమాలు చేపట్టిందని ఎంపీ తేజసీ సూర్య అన్నారు. ఐరన్ మ్యాన్ 70.3 ఓర్పు పరిక్షించే వేదిక. మంచి ఆరోగ్యం ఫిట్‌నెస్ కోసం ఇది ఉపయోగపడుతుంది. క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అని తేజస్వీ సూర్య అన్నారు.