రూ.49ల పెట్టుబడితో రూ. కోటి గెలుచుకున్న గిరిజన యువకుడు - MicTv.in - Telugu News
mictv telugu

రూ.49ల పెట్టుబడితో రూ. కోటి గెలుచుకున్న గిరిజన యువకుడు

October 20, 2022

MP: Tribal boy invests Rs 49, wins Rs 1 crore on Dream 11

డ్రీమ్ 11లో బెట్టింగ్ వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు ఓ యువకుడు. మద్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలోని గిరిజన పేద కుటుంబానికి చెందిన రామేశ్వర్ సింగ్ (24).. కేవలం రూ.49ల పెట్టుబడి పెట్టి రూ.కోటి గెలుచుకున్నాడు. సోమవారం భారత్‌-ఆస్ట్రేలియా టీ20 వార్మప్‌ మ్యాచ్‌ కోసం యాప్‌లో టీమ్‌ని సెట్‌ చేసి.. ఈ మొత్తం గెలుచుకున్నాడు.

రామేశ్వర్‌సింగ్‌ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించాడు. ఉండేందుకు మంచి ఇల్లు కూడా లేదు. రామేశ్వర్ కుటుంబాన్ని పోషించేందుకు ఓ పాఠశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. చాలా రోజులుగా డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ చేస్తున్నాడు. ఎప్పటి లాగే సోమవారం భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం బెట్టింగ్ వేయగా అదృష్టం వరించి కోటి రూపాయలు గెలుచుకున్నారు. దీంతో విషయం తెలిసిన రామేశ్వర్‌ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. గ్రామస్తులు ఆయనకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రామేశ్వర్ సింగ్ భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ కోసం 9 జట్లను సెట్ చేశాడు. మ్యాచ్‌ పూర్తయ్యేసరికి.. రామేశ్వర్‌ జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ.49 పెట్టుబడితో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తాను డ్రీమ్ 11లో రెండు సంవత్సరాలుగా బెట్టింగ్ చేస్తున్నానని.. ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని..ఏదో ఒక రోజు లక్షాధికారిని అవుతాననే బెట్టింగ్ చేసేవాడినని రామేశ్వర్ అన్నాడు. చివరకు అతడికి అదృష్టం కలిసి వచ్చి ఏకంగా కోటీశ్వరుడే అయ్యాడు.