MP woman finds raw diamond in forest while collecting firewood
mictv telugu

కట్టెల కోసం అడవికెళ్లిన మహిళకు వజ్రం లభ్యం

July 28, 2022

కట్టెలు కోసం అడవికి వెళ్లిన ఓ గిరిజన మహిళకు అరుదైన వజ్రం లభించింది. కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని తిరిగొస్తున్న క్రమంలో దారిలో.. మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా మెరుస్తున్న ఆ రాయిని చూసి షాక్ అయింది. మధ్యప్రదేశ్‌లోని పెన్నా జిల్లాకు చెందిన గిరిజన మహిళ.. అడవిలో కట్టెలు కొట్టేందుకు వెళ్లేది. ఇటీవల కట్టెలు తీసుకొని ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో ఆమెకు మెరుస్తున్న రాయి ఒకటి దొరికింది. ఆ రాయి తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత భర్తకు చూపించింది. ఆ రాయిని అతడు స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి చెక్ చేయగా.. అది విలువైన వజ్రం అని తేలింది. దాని బరువు 4 క్యారెట్ల 39 సెంట్లు ఉంటుంది. అలాగే దీని మార్కెట్ విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. త్వరలో జరగబోయే వజ్రాల వేలంలో ఈ అరుదైన వజ్రాన్ని ఉంచుతామని అధికారులు తెలిపారు. వజ్రాన్ని వేలం వేసి, ప్రభుత్వ రాయల్టీ మరియు పన్నులు మినహాయించి, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆ గిరిజన మహిళకు అందజేస్తామని తెలిపారు.

DIAMOND