జడ్జికి అక్రమ సంబంధం.. విషం పెట్టిన చంపిన ప్రియురాలు - MicTv.in - Telugu News
mictv telugu

జడ్జికి అక్రమ సంబంధం.. విషం పెట్టిన చంపిన ప్రియురాలు

July 30, 2020

అక్రమ సంబంధం ఓ జడ్జి ప్రాణం తీసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో జరిగింది. బేతుల్ నగర జడ్జి మహేంద్ర త్రిపాఠికి సంధ్యారాణి(45) అనే సామాజిక కార్యకర్తతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమసంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ళు ఇద్దరు వివాహేతర సంబంధంలో ఉన్నారు. కానీ, గత నాలుగు నెలలగా మహేంద్ర త్రిపాఠి.. సంధ్యారాణిని దూరం పెడుతున్నాడు. దీంతో ఆమె కోపాద్రిక్తురాలైంది. తనను పట్టించుకోవడం లేదని జడ్జి కుటుంబాన్ని అంతమొందించాలనుకుంది.  ఈ క్రమంలో జులై రెండో వారంలో సంధ్యారాణి.. మహేంద్రను కలిసింది. ఇంట్లో ఉన్న సమస్యలు పోవడానికి పూజలు చేయిస్తానని తెలిపింది. అందుకు గోధుమ పిండి కావాలని కోరింది. మళ్లీ ఆ పిండిని తిరిగి ఇస్తాను దానితో చపాతీలుగా చేసుకుని తీంటే ఇంట్లో సమస్యలు అన్ని పోతాయని నమ్మబలికింది. దీంతో ఆ జడ్జి నమ్మాడు. 

జులై 20న ఆమె మంత్రాలు చేయించిన గోధుమ పిండిలో విషం కలిపి జడ్జి కుటుంబానికి ఇచ్చింది. అదే రోజు రాత్రి మహేంద్ర కుటుంబం ఆ గోధుమ పిండితో చపాతీలు చేసుకున్నారు. జడ్జితో పాటు ఇద్దరు కుమారుడు ఆ చపాతీలను తిన్నారు. భార్యేమో అన్నం తిన్నది. చపాతీలు తిన్న కాసేపటికే జడ్జికి, ఆయన కొడుకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. జులై 25న వారి పరిస్థితి విషమించడంతో జడ్జి ఆస్పత్రిలోనే మరణించాడు. ఆయన పెద్ద కొడుకుని నాగపూర్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మరణించాడు. చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంధ్యారాణి, ఆమె డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ..తానే గోధుమ పిండిలో విషం కలిపి ఇచ్చినట్లు ఆమె ఒప్పుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.