ఎంపీలకు జీతాలు సరిపోవడం లేదట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టే తమకు పెంచాలంటున్నారు.సెక్రటరీల కంటే తక్కువ జీతాలు ఎంపీలు అందుకుంటున్నారు అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ అన్నారు. వెంటనే ఎంపీల జీతాలు, అలవెన్సులు పెంచాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు. గతేడాది కూడా ఎస్పీ నేతే రామ్గోపాల్ యాదవ్ ఎంపీల జీతాలు పెంచాలని కోరారు.
యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని అప్పట్లో ఎంపీ నరేశ్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న ఎంపీల బేసిక్ సాలరీని రెట్టింపు చేయనున్నారని గతేడాది వార్తలు వచ్చాయి. దీనికి పీఎంవో కూడా ఆమోదం తెలిపింది. అయితే వాళ్ల జీతాలు మాత్రం పెరగలేదు. ఏడో వేతన సంఘం సిఫారసుల అమలు తర్వాత కేబినెట్ సెక్రటరీ జీతం రూ.2.5 లక్షలకు చేరింది.