'సర్కార్ 2'లో మిస్టర్ ప్రగ్నెంట్ టీం..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

‘సర్కార్ 2’లో మిస్టర్ ప్రగ్నెంట్ టీం..వీడియో వైరల్

June 16, 2022

ప్రముఖ ఓటీటీ యాప్ ‘ఆహా’లో ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతున్న ‘సర్కార్ 2’ గేమ్ షోలో ఈ వారం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీం సందడి చేయబోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో జూన్ 14న విడుదలైంది. విడుదలైన రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్, 3,600 లైక్‌లతో దూసుకెళ్తోంది.

ప్రోమోలో.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ రూపా కొడవాయూర్ తన ఎంట్రీతో అదరగొట్టగా, హీరో సోహెల్, నటుడు బ్రహ్మాజీ ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చి, ‘సొట్ట చెంపలోడ’ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ, షోలో ఉన్న ఆడియెన్స్ చేత ఈలలు వేయించారు. ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ ఈయనేనా అంటూ యాంకర్ ప్రదీప్ డైరెక్టర్‌పై హాస్యంగా ప్రశ్నలు వేశారు. దానికి బ్రహ్మాజీ సమాధానాలు చెప్తూ, అందరినీ నవ్వించారు. ఈ సినిమా కోసం తాను తాట్టెడు అన్నం తిన్నాను అంటూ హీరో సోహెల్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. వెంటనే బ్రహ్మాజీ హీరోయిన్ రియాల్‌గానే డాక్టర్ అంటూ చెప్పడంతో యాంకర్ ప్రదీప్ దీపికా పిల్లిపై కామెంట్స్ చేస్తూ, గేమ్‌లోకి తీసుకెళ్లిపోయాడు. గేమ్‌లో భాగంగా వేలంపాట విషయంలో ఒకరిపై ఒకరు పోటీపడూతూ ఉత్సహంగా పంచులు వేస్తూ, హీరో, హీరోయిన్స్ ఆడియోన్స్‌కు వినోదాన్ని ఇస్తున్నారు’

ఇక, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా విషయానికొస్తే.. బిగ్‌బాస్ సీజన్ 4తో ప్రేక్షకుల మనసును గెలిచిన సోహెల్ ఈ సినిమతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ `మిస్టర్ ప్రెగ్నెంట్` అనే చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేయగా, మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ఈ `మిస్టర్ ప్రెగ్నెంట్` ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ 2 షోలో సందడి చేస్తూ, లక్షల వ్యూస్‌లో దూసుకెళ్తోంది. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.