Mrinal Thakur made shocking comments on husband and children
mictv telugu

భర్త వద్దు సంసారం వద్దు.. కానీ అది కావాలి : సీతారామం హీరోయిన్

September 13, 2022

Mrinal Thakur made shocking comments on husband and children

సీతారామం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మరాఠీ నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడని ఆమె.. పెళ్లి కాకపోయినా పిల్లలను కంటానంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ‘30 ఏళ్లున్న స్త్రీలు ప్రేమ, పెళ్లి, సంతానం, డేటింగ్ వంటి వాటిపై అంతగా ఆసక్తి చూపించదు.

నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. నాకు రక్షణ కల్పించే వ్యక్తి, నా మనసులో ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటా. లేకపోతే చేసుకోను. అయినా మన సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ ప్రశ్నలు వేస్తారు. నాకు పెళ్లంటే పెద్ద ఆసక్తి లేదు కానీ, పిల్లలను కనాలని ఉంది. వారితో అమ్మా అని అనిపించుకోవాలని ఆశపడుతున్నాను. పెళ్లి చేసుకోకపోయినా పిల్లలను కంటానని అమ్మతో చెప్పాను. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా నా పిండాన్ని భద్రపరిచి అమ్మను అవుతానని చెప్పాను. తను కూడా సంతోషంగా ఒప్పుకుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా, సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిన మృణాల్ ఠాకూర్‌కి అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి.