లంచానికి పరాకాష్ట.. చివరికి గేదెను కూడా వదల్లేదు..! - MicTv.in - Telugu News
mictv telugu

లంచానికి పరాకాష్ట.. చివరికి గేదెను కూడా వదల్లేదు..!

September 12, 2019

Bribes ...

ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా పని జరగాలంటే చేతులు తడిపితే కానీ అవి పూర్తికావు. మామూలు ముట్టజెప్పితేనే కొంత మంది అధికారులు పనులు చేస్తారు. ఇలాంటి లంచావతారులు ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నారు.అయినా వారి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎమ్మార్వో చేసిన పని లంచగొడితనంలోనే పరాకష్టగా నిలిచింది. తాను అడిగిన సొమ్ము ఇవ్వలేదని ఏకంగా రైతు వద్ద నుంచి గేదెను తీసుకెళ్లాడు.  

నాయిబ్‌ ప్రాంతానికి చెందిన భూపేంద్ర అనే వ్యక్తి తన భూమి వివరాల కోసం తహశీల్దారు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎమ్మార్వోసిద్ధార్థ్‌ సింఘాల్‌ను సంప్రదించగా పనిని దాటవేస్తూ వచ్చాడు. ఆరు నెలలు ఆయన చుట్టూ తిరిగిన ఫలితంలేదు. ఎమ్మార్వో తీరుతో విసిగిపోయిన భూపేంద్ర గట్టిగా నిలదీయడంతో రూ. 25,000 ఇస్తేనే పని జరుగుతుందని చెప్పాడు. అయితే అంత డబ్బు ఇచ్చే స్థోమత లేదని చెప్పాడు. లంచానికి బదులు తన వద్ద ఉన్న గేదెను ఇవ్వాలని చెప్పి దాన్ని కారుకు  కట్టుకొని తీసుకెళ్లాడు.

ఈ వ్యవహారం బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై  ఎమ్మార్వో మాత్రం మరోలా స్పందిస్తున్నాడు. తాను గేదెను తీసుకెళ్లలేదని.. కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చెబుతున్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు.