ఎమ్మెర్వో సజీవదహనంలో గాయపడ్డ అటెండర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెర్వో సజీవదహనంలో గాయపడ్డ అటెండర్ మృతి

December 2, 2019

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన ఘటనలో మరొకరు మృతి చెందారు. కంచన్‌బాగ్‌ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మార్వో ఆఫీస్ అటెండర్‌ చంద్రయ్య మృతిచెందారు. ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విజయారెడ్డి కాలిపోతున్న సమయంలో ఆమెను కాపాడబోయి చంద్రయ్య గాయాలపాలయ్యారు. అప్పటి నుంచి డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Mro

తహశీల్దార్ విజయారెడ్డిపై హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ ముదిరాజ్‌ పెట్రోల్ పోసి సజీవదాహం చేసిన సంగతి తెల్సిందే. సురేష్ పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయరెడ్డి తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని, తనను వేధించారని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకే ఆమెను సజీవదహనం చేశానని పోలీసుల విచారణలో రైతు సురేష్ అంగీకరించారు. సురేష్ కూడా కొంపల్లిలోని సన్‌రైజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనలో విజయారెడ్డిని కాపాడబోయి ఆమె కార్ డ్రైవర్ గురునాథం డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతిచెందారు.