MRT Music company filed a copyright case against Rahul Gandhi over KGF 2 songs
mictv telugu

జోడో యాత్రకు కాపీరైట్ చిక్కులు.. రాహుల్‌గాంధీపై కేసు నమోదు

November 5, 2022

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. అయితే ఈ యాత్రకు కాపీరైట్ చిక్కులు వచ్చిపడ్డాయి. దేశవ్యాప్తంగా హిట్ కొట్టి మంచి కలెక్షన్లు సాధించిన కేజీఎఫ్ 2 సినిమాలోని పాటను యాత్రకు వాడుకున్నారని రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియా శ్రీనటే వంటి నేతలపై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదైంది.

ఈ సినిమా హిందీ పాటల హక్కులను భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నామని బెంగళూరుకి చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ తమ అనుమతి లేకుండా పాటలకు వాడుకుంటోందని అందులో పేర్కొంది. పాటల బ్యాగ్రౌండుతో వీడియోలు రూపొందిస్తున్నారని ఆరోపించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాక, ఐటీ లా ప్రకారం 403, 465, 120, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 63 కాపీరైట్ యాక్ట్ కింద మరో కేసు ఫైల్ చేశారు.