ఏమంటె మనోళ్లు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ల ఓడిపొయ్యిన్రో…దేశంలున్న పబ్లిక్కు మొత్తం మస్తు నారాజ్ అయ్యిన్రు,ఒక్కోతానైతె.. టీవీలు వలగ్గొట్టుడు,ఆటగాళ్లను ఇష్టమున్నట్టు తిట్టుడు,ఇంకొందరైతె ఆళ్ల కండ్లముంగట బిందె వెడ్తె బొర్రిపోయెతట్టు ఏడ్శిన్రుగుడ.మరి గింతమందిని గిన్ని తీర్ల నారాజ్ జేశ్న… గ ఆటగాళ్లతోనే మల్లా అందర్ని ఖుషిజేద్దామని అన్కున్నట్టున్నరు కొందరు నెటిజన్లు..మరి ఏం ఉపాయం జేశిన్రో మీరే సద్వున్రి..
ధోని తల్లి:ధోని మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తేరా
ధోని: మొన్నటి మ్యాచ్ ఓడి పోయాం కదా జనాలు కోపంతో వుంటారు మమ్మి
తల్లి: నా చీర కట్టుకొని వెళ్లు ఎవరు గుర్తు పట్టరు.ధోని చీర కట్టుకొని మార్కెట్ కు వెళ్ళాడు
ఒక అమ్మాయి: హాయ్,ధోని ఎలా ఉన్నావ్?
ధోని షాక్ తో: నువ్వు నన్ను ఎలా గుర్తు పట్టావు?
అమ్మాయి: ఓయ్ ధోని నేను కోహ్లీని… ???
వాట్సప్ గ్రూపులల్లనైతె ఇది.. బంతిని సిక్స్ కొడితె ఎట్ల వోతదో సేమ్ అట్లనే శెక్కర్లు గొడ్తుంది.