ధోనిపై ఇంత అభిమానమా?.. ఏం చేశాడో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

ధోనిపై ఇంత అభిమానమా?.. ఏం చేశాడో చూడండి

October 14, 2020

MS Dhoni fan paints his house yellow to pay tribute to CSK captain

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్, భారత క్రికెట్ అభిమానులకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. భారత్ లో కోట్లలో ఉన్నారు. ఆ అభిమానులు వారి అభిమానాన్ని వివిధ రకాలుగా వ్యాకరపరుస్తూ ఉంటారు. కొందరు ధోని టీషర్ట్ ధరిస్తారు. కొందరు ధోని పేరుని టాటూగా వేసుకుంటారు. అయితే, తమిళనాడుకి చెందిన ఓ ధోని అభిమాని గోపికృష్ణన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. 

తన ఇంటికి మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ రంగు అయిన పసుపు పులిమాడు. తన ఇంటి ముందు గోడల పైన ధోని ఫొటోలను, పక్క గోడలపైన సీఎస్కే లోగోను అలాగే ‘విజిల్ పోడు’ అనే ట్యాగ్ లైన్ ను పెయింట్ చేయించాడు. ఇంటి ముందు ఇది ధోని అభిమాని ఇల్లు అని రాయించాడు. ఈ రంగులకు గోపికృష్ణన్ రూ .1.50 లక్షలు ఖర్చు చేశాడని తెలిపాడు. ఈ ఇంటి ఫోటోలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.