షూలేస్‌ కట్టుకోవడం రాదు, ధోనీపై కామెంట్లు..రవి శాస్త్రి ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

షూలేస్‌ కట్టుకోవడం రాదు, ధోనీపై కామెంట్లు..రవి శాస్త్రి ఆగ్రహం

October 26, 2019

MS Dhoni  .

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడే వారిపై టీమ్ఇండియా కోచ్‌ రవిశాస్త్రి ఘాటుగా విమర్శలు చేశారు. ధోనీ రిటైర్మెంట్‌ గురించే మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్‌ కూడా కట్టుకోవడం రాదని ఎద్దేవా చేశాడు. 

రవి శాస్త్రి మాట్లాడుతూ…’భారత క్రికెట్ జట్టుకు ధోనీ 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టుకి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. క్రికెట్‌ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలో అతడికి తెలుసు. టెస్టులకు దూరమైనప్పుడు అతడు ఏమి చెప్పాడు? జట్టుకు అతడు నీడలాంటి వాడు. భారత జట్టుకి విజయాలు అందించడానికి అతడి ఆలోచనలను జట్టుతో పంచుకుంటాడు. ధోనీ రిటైర్మెంట్‌పై వ్యాఖ్యలు చేయడమంటే అతడిని కించపరిచినట్లే. ధోనీ రిటైర్మెంట్ గురుంచి మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్‌ కట్టుకోవడం కూడా రాదు. ధోని రిటైర్ కావాలని వారెండుకు ఎదురుచూస్తున్నారు? మాట్లాడుకోవడానికి వేరే విషయాలు లేక అతడి గురించి చర్చిస్తున్నారా? ధోని భవిష్యత్తులో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అతడే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. మీ చర్చలకు ముగింపు పలుకుతాడు. ధోనీ తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించే హక్కుని సంపాదించుకున్నాడు’ అని తెలిపాడు. ధోని ప్రపంచ కప్ సెమీఫైనల్ నుంచి జట్టుకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసందే.