మైదానంలోకి పరిగెత్తిన ధోని.. ఐపీఎల్ జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

మైదానంలోకి పరిగెత్తిన ధోని.. ఐపీఎల్ జరిమానా

April 12, 2019

చెన్నై సూపర్స్ కెప్టెన్ ధోనికి జరిమానా పడింది. రాజస్థాన్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దీన్ని ఐపీఎల్ తీవ్రంగా తీసుకుని, నియమావళి ఉల్లంఘన రెండో స్థాయి నేరంగా పరిగణిస్తూ.. ఆర్టికల్ 2.20 ప్రకారం శిక్ష విధించింది. దీంతో ధోనికి ఈ మ్యాచ్ ఫీజులో 50శాతం కోత పడింది.

MS Dhoni let off with 50 per cent fine after angry reaction to umpire's call

చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న రాత్రి మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆఖరి ఓవర్ మూడు బంతుల్లో 9 పరగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న శాంట్నర్ కు రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్.. వికెట్ల కంటే ఎత్తులో బంతిని వేశాడు. దీంతో అంపైర్లు ఉలాస్ గాందే, బ్రూస్ ఆక్సెన్‌ఫర్డ్ మొదట నోబాల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కితీసుకున్నారు.

దీంతో ఆగ్రహానికి గురైన ధోని డగౌట్‌ నుంచి మైదానంలోకి ఆవేశంగా పరిగెత్తుకొచ్చి, అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. నిబంధనలకు వ్యతిరేకంగా ధోని మైదానంలోకి వెళ్లడాన్ని ఐపీఎల్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని ధోనికి జరిమానా విధించింది.