ఎక్కడ ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ జరిగినా స్టాండ్స్ లో అతను ఉంటాడు. లైవ్ కెమెరాల్లో మ్యాచ్ అయిపోయేలోపు ఒకటి,రెండుసార్లైనా కనిపిస్తాడు. అతడే తెల్లగడ్డంతో కనిపించే పాకిస్థాన్ టీమ్ ఫ్యాన్ మహ్మద్ బషీర్ అలియాస్ చికాగో చాచా..ఇప్పుడు ఇతని సోది ఏంటీ అని అనుకుంటున్నారా…
జూన్ 4న జరిగే ఇండియా-పాక్ మ్యాచ్ లో గెలుపెవరిది..పాకిస్తోడ్ని అడిగితే కచ్చితంగా వాళ్ల దేశానిదే అని చెబుతాడు.కానీ పాక్ పిచ్చా ఫ్యాన్ మాత్రం భారత్ దే గెలుపు పక్కా అంటున్నాడు. అంతే కాదు తాను అభిమానించే మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనితో ఫోటో దిగాడు. అసలు విరాట్‌సేనతో పోటీపడే సత్తా పాక్‌కు ఎక్కడుందని ఈ చికాగో చాచా అంటున్నాడు. “అందరూ అనుకున్నట్లుగా ఇండో-పాక్ మ్యాచ్‌లో పోటీ ఎక్కడుంది? పాక్‌తో పోలిస్తే ఆటపరంగా భారత్ ఎంతో ముందుంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే గెలుస్తుంది. భారత్‌లో ధోనీ, కోహ్లీ, యువరాజ్‌లాంటి పెద్ద స్టార్లు ఉంటే పాక్‌లో ఎవరున్నారు”అని బషీర్ అంటున్నాడు. 2011 వరల్డ్‌కప్ నుంచి భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా తప్పకుండా వచ్చే చాచా ఈసారి రంజాన్ తో మక్కా వెళ్లాడు. దీంతో ఈ మ్యాచ్‌ను చూడలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.