సన్ని లియోన్ కన్నా ధోని డేంజర్..మెకాఫీ సంస్థ - MicTv.in - Telugu News
mictv telugu

సన్ని లియోన్ కన్నా ధోని డేంజర్..మెకాఫీ సంస్థ

October 23, 2019

MSD   .

స్మార్ట్‌ఫోన్ వచ్చిన తరువాత ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దాంతో పాటు నెటిజన్లు ఏదైనా సమాచారం కోసం సెర్చ్ చేసేటపుడు నకిలీ లింకులు తగలడం..వాటి ద్వారా మోసపోవడం కూడా సర్వ సాాధారణమైపోయింది. తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల కోసం నెటిజన్లు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఇదే అదనుగా వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. నెట్‌లో సెర్చ్ చేసే సమయంలో నెటిజన్‌కు కావాల్సిన వెబ్‌సైట్స్ లింకులతో పాటుగా కొన్ని నకిలీ లింక్స్‌ను ఉంచుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే ఆ లింకులను క్లిక్ చేస్తే.. కావాల్సిన సమాచారం రాకపోగా.. వేరే ప్రమాదకరమైన సైట్స్‌కు రీడైరెక్ట్ అవుతుంది. 

అలా కొన్ని కొన్నిసార్లు అశ్లీల సైట్స్‌కు కూడా రీడైరెక్ట్ అవుతుంది. తెలియకుండా పొరపాటుగా ఓపెన్ చేస్త ఇక అంతే. గూగుల్‌లో సమాచారం కోసం సెర్చ్ చేసే సమయంలో ఇలాంటి లింక్స్ ఎక్కువగా ఓపెన్ అవుతుంటాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని గురించి అభిమానులు సెర్చ్ చేస్తున్న సమయంలో ఇలాంటి సైట్స్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నట్టు ప్రముఖ యాంటీవైరస్ తయారీ సంస్థ ‘మెకాఫీ’ తన సర్వేలో వెల్లడించింది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాలో ఎవరెనున్నారో ఓ నివేదికను సిద్ధం చేసింది. ఈ లిస్ట్‌లో ధోని మొదటి స్థానంలో ఉండగా సచిన్ రెండో స్థానంలో టీవీ నటి గౌతమ్ గులాటి, సన్నీ లియోన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉండటం విశేషం. రాధిక ఆప్టే, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కావున ఈ సెలెబ్రిటీల కోసం నెట్ లో సెర్చ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని మెకాఫీ సంస్థ సూచిస్తోంది.