లాక్‌డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. స్కూల్స్, ఆఫీసులు, సినిమా థియేటర్ల మూతపడ్డాయి. బస్సులు, రైళ్లు, విమానాలు నడవడం లేదు. దీంతో కాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు, పర్వతాలను కూడా ప్రజలు నేరుగా చూడగలుగుతున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ నగర ప్రజలకు 200 కి.మీ. ఉపరితల దూరంలో ఉన్న గంగోత్రి, బంద్రాపంచ్ పర్వాతాలు కన్పించాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలో పంజాబ్ లోని జలంధర్ ప్రజలకు 160 కి.మీ దూరంలోని హిమాచల్ ప్రదేశ్ లోని మంచుతో కప్పబడిన దౌలాదర్ హిమాలయ రేంజ్ ను కనపడింది.
తాజాగా బీహార్ ప్రజలకు ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది. రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో సింగ్‌వాహిని అనే గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా అంత దూరంలో ఉన్న హిమాలయ పర్వతాన్ని ఆ ఊరి ప్రజలు నేరుగా చూడగలుగుతున్నారు. వారి గ్రామం నుంచి హిమాలయా పర్వతాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.