ఈ బోలెరోను ఎత్తేసింది బాలయ్య కాదు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ బోలెరోను ఎత్తేసింది బాలయ్య కాదు..!

March 28, 2018

వివి వినాయక్ సినిమాల్లో బాంబుపేలుళ్లకు బోలెరో వాహనాలు ఎగిరి మైళ్ల ఎత్తుకెళ్లాయి. మన బాలయ్యబాబు కూడా అలవోకగా బోలెరోలను ఎత్తిపారేస్తుంటారు. అయితే ముంబై మహానగరంలో ఇలాంటి ఫీట్లు చేయడానికి వీరు అక్కర్లేదు. జస్ట్ నీళ్లే ఆ పనిచేస్తుంటాయి. బోరివిలి, కండివలి, దహిసార్ల మీదుగా వెళ్లే నీటి గొట్టం బద్దలై బోలెరో వాహనాన్ని గాల్లోకి విసిరేసింది. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబైలో నీటి పైపులు పగడం సాధారణమే. బోరివిలీలో ఓ చోట 72 అంగుళా పైపులోంచి నీరు లీకై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తర్వాత లోపలి ఒత్తిడికి తట్టుకోలేక పైపు బద్దలై బోలెరోతో ఇలా ఆడుకుంది. వాహనలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.