అందరికీ  అన్నం పెడుతున్న అన్నపూర్ణుడు.....! - MicTv.in - Telugu News
mictv telugu

అందరికీ  అన్నం పెడుతున్న అన్నపూర్ణుడు…..!

July 31, 2017

వయసు మీద పడి శాత గాక….కనీసం తినే తిండి కూడా వండుకోలేనీ  నిస్సహాయ స్థితిలో ఉండే అమ్మమ్మలు,తాతలు ఎందరో,కడుపున పుట్టినోళ్లు కన్నోళ్లను పట్టిచ్చుకోకుంటే..వాళ్లని కష్టపెట్టడం ఇష్టంలేక దూరంగా బ్రతుకుతున్న ముసలి తల్లిదండ్రులు ఎందరో,అలాంటి వారికి  ఒకసారి కాదు రొండు సార్లు కాదు ప్రతిరోజు క్యారేజ్ కట్టుకొని,సీనియర్ సిటిజన్స్ వాళ్ల ఇంటింటికి తిరిగి వాళ్ల ఆకలి తీర్చుతున్నాడు ఓ మహానుభావుడు..

అతని పేరు డాక్టర్ ఉదయ్ మోడి …ముంబయ్ లో అతనో ఆయుర్వేద డాక్టర్,పది సంవత్సరాల క్రితం  ఆయన దగ్గరకు ఆరోగ్య సమస్య కారణంగా ఓ వృద్ద జంట వచ్చిందట,మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు,అని అడిగితే,వాళ్లు చెప్పిన సమాధానం విన్న ఉదయ్ మోడీ మనసు చెలించిపోయింది.వాళ్లకు ముగ్గురు కొడుకులున్నా కన్నవాళ్లని పట్టించుకోని పరిస్థితి..అప్పుడే డిసైడ్ అయ్యాడు వాళ్లకు ప్రతిరోజు తన ఇంటినుంచే భోజనం పంపియ్యాలని,అలా మొదలైనా సేవాకార్యక్రమం..ఇప్పడు దాదాపు 500 మంది దాకా చేరింది,రోజూ ఇంట్లో వండిపిచ్చి క్యారేజ్ లు కట్టి ఆటోలో ఎవరైతే  వండుకోని స్ధితిలో ఉన్న వృద్దులకు ఆహారాన్ని అందిస్తున్నారు.ఇంతమందిని నేను నా తల్లిదండ్రులుగా భావిస్తానని…ఇంతమంది తల్లిదండ్రుల ప్రేమను పొందడం నిజంగా నా అదృష్టం అనీ అంటారు డాక్టర్ ఉదయ్ మోడీ, ఈయన సేవా కార్యక్రమం గురించి తెలుసుకున్న వారు…అతనికి సెల్యూట్ చేస్తున్నారు.కడుపున పుట్టినోళ్లే తల్లిదండ్రులను  పట్టిచ్చుకోని ఈకాలంలో గూడ ఈయన ఇంతమంది ఆకలి తీర్చుతున్నడంటే గ్రేట్ కదా..