అనిల్ – అర్జున్ ముబారకన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

అనిల్ – అర్జున్ ముబారకన్ !

June 21, 2017

చిచ్చా – భతీజా కలిసి ‘ ముబారకన్ ’ సినిమాలో కడుపు కల్లిబిల్లి అయ్యేటట్టు నవ్వించడానికి సిద్ధంగా వున్నారు. ఇంతకూ ఆ చిచ్చా – భతీజాలు ఎవరనుకుంటున్నారూ ? మన బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ అండ్ వాళ్ళ అన్న బోనీకపూర్ కొడుకు, యువ హీరో అయినటువంటి అర్జున్ కపూర్ లు కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేస్కుంటున్నారు. ఇందులో హీరోయిన్ గా ఇలియానా నటించింది. ఈ జూలై 28 న రిలీజ్ కు సిద్ధంగా వుంది. నో ఎంట్రీ, వెల్ కమ్, సింగ్ ఈజ్ కింగ్ వంటి సూపర్ డూపర్ హిట్లను బాలీవుడ్ కు అందించిన క్రేజీ డైరెక్టర్ అనీస్ బజ్మీ డైరెక్షన్ లో ఈ క్రేజీ రొమాంటిక్ కామెడీ సినిమా రాబోతోంది. చూడాలి మరి బాబాయ్ – అబ్బాయ్ ల సినిమా ఏ రేంజులో ఆడియన్సును అలరిస్తుందో…