నేడు హైదరాబాద్‌లో 9 చోట్ల మట్టి గణపతుల పంపిణీ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు హైదరాబాద్‌లో 9 చోట్ల మట్టి గణపతుల పంపిణీ

August 30, 2019

Mud ganpati..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా హెచ్‌ఎండీఏ పంపిణీ చేస్తున్న మట్టి గణపతి విగ్రహాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. వందల్లో కాలనీ సంఘాలు, ప్రజల నుంచి మట్టి విగ్రహాలు కావాలని అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం వరకు నింర్వహించాలని పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం మాదాపూర్‌లోని మైహోం, నవదీప కేంద్రంలో అరవింద్‌కుమార్ ప్రజలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.

అలాగే గణేశ్ నవర్రాతులకు మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విగ్రహాల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం గ్రేటర్‌లో 9 కేంద్రాలను ఏర్పాటు చేసి విగ్రహాలను పంపిణీ చేయనుంది. మొత్తంగా గ్రేటర్ నగరంలో 1.64 లక్షల 8 ఇంచుల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పీసీబీ సభ్యకార్యదర్శి వి.అనిల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే విగ్రహాలను పంపిణీ చేస్తామని, నగర వాసులంతా ఆయా పంపిణీ కేంద్రాలకు వచ్చి విగ్రహాలను తీసుకెళ్లాలని తెలిపారు. మట్టి గణపతులను పంపిణీ చేయు కేంద్రాలు ఎల్బీనగర్, మదీనాగూడ, ఉప్పల్ ఎక్స్‌రోడ్, నాగోలు చౌరస్తా, ఐడీఏ మల్లాపూర్, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, బాలానగర్-బీఆర్ దవాఖాన, జీడిమెట్ల రైతుబజార్, సుచిత్ర ఎక్స్‌రోడ్స్.