మట్టితో స్నానం చేస్తే రోగాలన్నీ మటాష్..! - MicTv.in - Telugu News
mictv telugu

మట్టితో స్నానం చేస్తే రోగాలన్నీ మటాష్..!

July 11, 2017

మనం తీసుకునే ఆహర పదార్థాల్ని మట్టిలోంచి వచ్చినవే. మనిషిని ,మట్టిని వేరు చేయలేం. ఆరోగ్యం విషయంలో మట్టి పాత్ర చాలా కీలకం.అందుకే ప్రకృతి వైద్య విధానంలో మట్టితో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

పొత్తి కడుపును గర్బకుహరపు మెదడు (అబ్డామినల్ బ్రెయిన్) అని కూడా అంటారు 72 వేల
నాడులు బయల్దేరి శరీనానికంతటికీ శక్తినిస్తుంటాయి.కొందరి లో యూరిన్ సమస్యలు
తలెత్తుతాయి.యూరిన్ సాఫీగా జరకపొవచ్చు.ఇది పలు రకాల వ్యాధులకు దారి తీయవచ్చు
ఈ పరిస్థితులను నివారించడంలో మడ్ ప్యాక్ చికిత్సలు బాగా ఉపయోగపడుతాయి.

శరీరమంతా బురద పూసే ఈ వైద్యానీ మడ్ బాత్ అని అంటారు శరీరంలోని ఏ భాగాలకు
విడివిడిగా పట్టీలు వేయడాన్ని మడ్ ప్యాక్ అని అంటారు.ఈ మట్టి వైద్యం వలన
ఉష్ణం,చర్మ వ్యాధులు,మంటలు తగ్గిపోతాయి.సెగగడ్డలు,పలురకాల వ్యాధులను
తగ్గించండంలో మంచి వైద్యంగా పనిచేస్తుంది.

నల్లరేగడి,ఒండ్రు మట్టి శరీరానికి ,చలువ ,ఎర్రమట్టి వేడి చేస్తుంది.నదీ పక్కన ఒడ్డు
ఉండే మట్టిగాని,కాలువ ఒడ్డున దొరికే మట్టిగాని ఈ చికిత్స లో ఎంతో శ్రేష్టం.ఇది లభించనప్పుడు
చెరువులు,కాలువలు, పొలాల్లో మట్టిని సేకరించి పెట్టుకొవాలి.ఈ మట్టి చెత్త, చెదారం,
దుర్వాసన లేకుండా శుభ్రం చేసుకొవాలి.మట్టిలో రాళ్లు.చెదారం లేకుండా చేసి మెత్తగా
దంచి,జల్లంచి,ఎండబెట్టి భద్రపరుచుకొవాలి.మన అవసరానికి తగ్గటు పిండివంట పిండిలా
మరి జారుగా కాకుండా కలిపి పెట్టుకొవాలి.

12 అంగుళాల పొడవు,6 అంగుళాల వెడల్పు క్లాత్ ని నీటిలో బాగా తడిపి ,పిండి ఒక పీట మీదగాని
బల్లా మీదగానీ ,పరచి ఉండాలి,ఇలా పరిచిన గుడ్డ మధ్య నానపెట్టిన మట్టిని ఒక అంగుళం
మందాన 8 అంగుళాల పొడవు,4 అంగుళాల వెడల్పూనా ఉంచాలి.మట్టి లేని మిగతా
గుడ్డను నాలుగు వైపులా మట్టి పైకి మరచి,రోగి బోడ్డు కింది పొత్తి కడుపు పై ఉంచాలి.
ఈ మడ్ ప్యాక్ ను 15 నిమిషాల మెదలు అవసరాన్ని బట్టి గంట దాకా కూడా ఉండవచ్చు.
కొన్ని పరిస్థితుల్లో గుడ్డ లేకపొతే ఒండ్రు మట్టిని పొత్తి కడుపు మీద పూయాలి.ఈ మట్టి
ఆరిపొగనే తిరిగి రాస్తూ ఉండాలి.అలాఅనుకున్న సమయంలో పదే పదే రాస్తూ ఉండాలి.

ఆ తర్వాత మడ్ ప్యాక్ తీసివేసి ,చల్లటి నీటితో కడగాలి.ఈ చికిత్స వల్ల 72 వేల నాడులు
చైతన్యం పొంది అధిక ఉష్ణం తగ్గుతుంది.ఎంతో కాలంగా నెలకొన్న అస్వస్థత తొలగిపొయి
ఆరోగ్యం చక్కబడుతుంది.