మహా రాజకీయం.. మఫ్టీలో పోలీసులు.. చివరికి ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

మహా రాజకీయం.. మఫ్టీలో పోలీసులు.. చివరికి ఇలా

November 25, 2019

మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తీసుకుంటూ ఆసక్తిని రేపుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తం అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టి శాసన సభ్యులను హోటళ్లలో ఉంచారు. బీజేపీ మిగిలిన మూడు పార్టీల ఎమ్మెల్యేలపై కన్నేయడంతో ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఇద్దరు పోలీసులు ఎన్సీపీ క్యాంపు ఏర్పాటు చేసిన చోట మఫ్టీలో తిరగడం కలకలం రేపుతోంది. 

Mufti Police.

ముంబైలోని రెనైజాన్స్‌ హోటల్‌లో ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలకు భస ఏర్పాటు చేసింది. అక్కడే ఇద్దరు మఫ్టీ పోలీసులు తిరుగుతూ అనుమానంగా కనిపించారు. వారిని అక్కడే ఉన్న నేతలు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. వారు ఎందుకు వచ్చారో చెప్పకపోవడంతో తమ వ్యూహాలను పసిగట్టేందుకే బీజేపీ ఇలా పోలీసులను రంగంలోకి దింపిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలపై ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో తమపై గూఢచర్యం నెపడంపై మండిపడుతున్నారు. ఎన్ని చేసినా తమ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.