Mughal successor's response to the Taj Mahal controversy
mictv telugu

రాజ్‌పుత్‌ల రక్తం నీలో ఉంటే.. మొఘల్ వారసుడి సవాల్

May 14, 2022

Mughal successor's response to the Taj Mahal controversy

తాజ్ మహల్ కట్టిన స్థలం తమదేనని కొద్దిరోజుల క్రితం జైపూర్ వంశస్తురాలు, బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యల పట్ల మొఘల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ టుస్సీ స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రూపొందించి ట్విట్టర్‌లో విడుదల చేశారు. అందులో దియా కుమారినుద్దేశిస్తూ ‘మీ ఒంట్లో ప్రవహించేది రాజపుత్‌ల రక్తం అయితే తాజ్ మహల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి.

మొఘలులకు రాజపుత్‌లు భూమిని కానుకగా ఇచ్చేవారు. అందులో భాగంగానే తాజ్ మహల్ స్థలం వచ్చి ఉంటుంది. అంతేకానీ, భూమిని ఆక్రమించి కట్టారన్నది నిరాధారమైన ఆరోపణ. అక్బర్ జమానా నుంచి రాజ్ పుత్‌లతో మొఘలులు సంబంధాలు పెట్టుకున్నారు. అక్బర్ భార్య జోధాబాయి అలియాస్ హర్కా బాయికి షాజహాన్ మనవడు అవుతాడు. షాజహాన్ రెండో భార్య లాల్ బాయి రాజ్ పుత్. దియా కుమారికి షాజహాన్ తల్లి తరపు బంధువు అవుతాడు. నాకున్న 27 మంది నానమ్మలలో 14 మంది రాజ్‌పుత్‌లే. ఎన్నో ఏళ్లుగా మొఘలులు, రాజపుత్‌ల మధ్య ఉన్న బంధాన్ని తెంచే ప్రయత్నం చేయవద్ద’ని వ్యాఖ్యానించారు.