Home > Featured > మొహర్రం వేడుకల్లో అపశ్రుతి.. పిట్టగోడ కూలి

మొహర్రం వేడుకల్లో అపశ్రుతి.. పిట్టగోడ కూలి

Muharram Festival ...

కర్నూలు జిల్లాలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.బి.తాండ్రపాడులో పిట్టగోడ కూలి 20 మంది గాయాపడ్డారు.ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయంతో అటూ ఇటు పరుగులు తీశారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సోమవారం రాత్రి పీర్ల పండగ సందర్భంగా గ్రామస్థులు అంతా నిప్పుల గుండంలో నడిచారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. పీర్ల చావిడి వద్ద ఇంటి పిట్టగోడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బరువు ఆపలేక గోడ కూలిపోయింది. దానిపైన ఉన్నవారంత కిందపడిపోయారు.బాధితులనుఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శించారు. వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Updated : 10 Sep 2019 2:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top