ముకేశ్ అంబానీ ఎందుకు ఏడ్చారు అంటే... - MicTv.in - Telugu News
mictv telugu

ముకేశ్ అంబానీ ఎందుకు ఏడ్చారు అంటే…

July 21, 2017

రిల‌యెన్స్ 40వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కన్నీళ్లు. ఈ 40 ఏళ్ల‌లో రిల‌యెన్స్ సాధించిన ప్ర‌గ‌తిని వివరిస్తూ ఏడ్చారు. దీంతో ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆయ‌న త‌ల్లి కళ్ల వెంటనీళ్లు కారిపోయాయి. 1977లో వస్త్ర‌వ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్త‌రించిన‌ట్లు అంబానీ చెప్పారు. ప్ర‌స్తుతం రిల‌యెన్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌న్నారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ ట‌ర్నోవ‌ర్ ప‌ది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్ల‌కు చేరింద‌ని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరార‌ని చెప్పారు. ఇక వెయ్యి ఉన్న షేరు ధ‌ర రూ. 16.5 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని ముకేష్ వెల్లడించారు.