భారతదేశంలో అపర కుబేరుడు ఎవరు అంటే తెలియని వాళ్ళెవ్వరూ ఉండరు. 24 అంతస్థుల పెద్ద భవనం, ఇంటినిండా పనివాళ్ళు, ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఇదంతా ఒక్క ముఖేష్ అంబానీకే సొంతం. రోజురోజుకూ అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. ఇంద్రభవనంలాంటి అంటిలియాలో విలాసవంతమైన జీవితం గడిపే ముఖేష్ అంబానీ మాత్రం చూడ్డానికి చాలా సింపుల్ గానే ఉంటారు. ఆయన జీవించే విధానం కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది అంటారు దగ్గర వాళ్ళు. అయితే ముఖేష్ ఇంటినిండా పనివాళ్ళు మాత్రం ఉంటారుట. అంతేకాదు వాళ్ళకు ఇచ్చే జీతాలు కూడా తక్కువ కాదంట.
మనందరం చాలా మామూలు జీవితం గడిపేవాళ్ళం. ఇండియాలో చాలా మంది మధ్య తరగతి వాళ్ళే. ప్రతీ నెల సంపాదించుకునే జీతాల్లోనే కొంత సేవింగ్ చేసుకుంటూ, కొంత ఖర్చు పెట్టుకుంటూ గడుపుతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ పనిమనిషి ఉంటోంది. ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్ళు డబ్బులు ఇచ్చి పనివాళ్ళను పెట్టుకుంటున్నారు. కొంచెం డబ్బులున్న వాళ్ళు ఓ స్థాయి పైకెక్కి వేలల్లో అంటే 3 నుంచి 5 వేల వరకు ఇచ్చి పనిమనుషులను, వంటవాళ్ళను పెట్టుకుంటున్నారు. మరి అలాంటిది ముఖేష్ ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఎంతెంత జీతాలిస్తారో తెలుసా. అసలు ముఖూష్ ఏం తింటారు, వాళ్ళ షెఫ్ కు జీతం ఎంత ఉంటుంది లాంటి వివరాలు చూస్తే మనకు కళ్ళు తిరగక మానవు.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లల్లో అంబానీ ఇల్లు ఆంటిలియా కూడా ముందువరుసలో ఉంటుంది. ఇక ఆ ఇంట్లో పనిచేసేవారిని అంబానీ సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటారట. ఇదే సమయంలో ఆయన వారికి ఇచ్చే జీతం గురించి ఇటీవల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. తన డ్రైవర్‌కు అంబానీ ఐదేళ్ల కిందటే నెలకు రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తారని తెలిసింది. ఇక ఇప్పుడు అంబానీ తన షెఫ్‌కు ఇచ్చే జీతం వైరల్ అవుతోంది. ఇది చాలా మంది ఎమ్మెల్యేల కంటే చాలా ఎక్కువట.
ముకేశ్ అంబానీ చాలా సాధారణమైన ఆహారం తీసుకుంటారు. ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారట. ఇక లొకేషన్ గురించి పట్టించుకోరట. అది రోడ్ సైడ్ స్టాల్ అయినా రోడ్ సైడ్ కెఫే అయినా తింటుంటారట. వంటకాల్లో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయిస్తారట. సరికొత్తగా చేయించుకుని తింటుంటారని వార్తలు వచ్చాయి. అంబానీ ఆహారపు అలవాట్లు ఆయన సాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయట.ముకేశ్ అంబానీకి థాయ్ వంటకాలంటే చాలా ఇష్టమట. వాటిపై ఇష్టం ఉన్నప్పటికీ ఆదివారం రోజు అల్పాహారం అంటే మెనూలో కచ్చితంగా ప్రసిద్ధ దక్షిణ భారత వంటకం ఇడ్లీ- సాంబార్ ఉండి తీరాల్సిందే. ఇక అంబానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. డిన్నర్ మాత్రం కచ్చితంగా కుటుంబంతో కలిసి చేసేలా చూసుకుంటారని ఆయన భార్య నీతా అంబానీ గతంలో చెప్పారు కూడా.
షెఫ్:
అంబానీ ఏం తింటారో అన్నీ కనిపెట్టుకుని చేసిపెట్టే షెఫ్ ఒకరు ఉంటారుట. ఇతను రోజూ ముఖేష్ కు కావల్సినవి వండిపెట్టడమే ఇతని పని. ఇతని జీతం నెలకు 2 లక్షల పైనే. ఇతనికే కాదు అంబానీ నివాసంలో పనిచేసే ప్రతి సిబ్బందికీ దాదాపు ఇంతే మొత్తంలో వేతనం ఉంటుందని సమాచారం. ఇక నెల జీతంతో పాటు ఇన్సూరెన్స్, పిల్లలకు ట్యూషన్ ఫీజులను కూడా అందిస్తారట.కొద్దిరోజుల కిందట అంబానీ వ్యక్తిగత డ్రైవర్ నెల వేతనం గురించి మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయింది. పెద్ద పెద్ద ప్రముఖుల ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లను ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు. అంబానీ ఇంట్లో డ్రైవర్ కూడా ఇలాగే వెళ్లారు. ఇక ఆయనకు కూడా ఐదేళ్ల కిందట నెలకు రూ.2 లక్షలు చెల్లించేవారట అంబానీ. ఇప్పుడు అది ఇంకా చాలా ఎక్కువే ఉండొచ్చు.